Saturday, March 23, 2019

ఎన్నికలు..సోషల్ మీడియా ప్రచారం

వెన్నుపోటు, కేసులు, బి పార్టి లాంటి చౌకబారు ప్రచారాలని మర్చిపోయి ఒకసారి తటస్తంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం..సేంద్రీయ వ్యవసాయం, రైతు పంటకి సరైన మార్కెటింగ్, కోల్డ్ స్టొరేజిలు, మస్త్యకారులకి జెట్టిలు, మరబోటులు వగైరా, ఇవి కదా నిజమైన సహాయం. అంతేకాని, ప్రతినెల అందరికి డబ్బులు పంచడం వాళ్ళని బిచ్చగాళ్ళని, సోమరులని చెయ్యటమే ఔతుంది..మరి మనం కట్టే పన్నులు ఇలా వృధా అవ్వటం ఎన్నాళ్ళు భరించాలి? రేషన్ లో అవినీతికి తావివ్వటం కన్నా, డబ్బులు నేరుగా మహిళల ఖతాలలో వెయ్యటం మంచి ఆలోచన కాదంటరా? దీనివల్ల వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని (ఆ విభాగం వరకు అయినా) సమూలంగ నిర్మూలన కాదా? వీటితో పాటు ప్రత్యేక రాస్ట్ర ప్యాకేజి, పారిశ్రామిక విధానం (చిత్తశుద్ధి ఎలాగూ ఉంది), మరి ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మార్పు తెస్తానన్న జనసేన బాగాలేదంటారా? ఆలోచించండి..ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటి రాకపోవచ్చు, కాని మార్పుకి తొలిమెట్టైనా ఔతుంది.. సోషల్ మీడియాలో ప్రచారం విఙ్నానవంతంగా, ఆలోచించేదిగా ఉండాలి కాని..తిట్టుకుంటూ ఎన్నాళ్ళు చేస్తారు? దానివల్ల ఉపయోగం ఏంటి?

Sunday, October 21, 2018

please visit http://suneeelam.blogspot.com for latest updates. i am no more blogging here.

Thursday, May 29, 2014

మొదలెట్టారు..


మొదలెట్టారు.. అక్కడ నరేంద్రుడు మంత్రివర్గానికి రాబోయే 100 రోజుల ప్రణలిఖ అడిగి అప్పుడే తన బాధ్యత మొదలెట్టాడు..ఇక్కడ చంద్రబాబు నూతన రాష్ట్రానికి కావాల్సిన అర్థిక, జల, శాంతి భద్రతల దృష్ట్యా సంబంధిత కేంద్ర మంతృలతో వరుస సమావేశాలతో ఇక్కడ మొదలెట్టాడు..ఇంకొకడు కూడా మొదలెట్టాడు..నువ్వు బందులు చేసుకో నాన్నా..

Thursday, May 22, 2014

పోరు ముగిసింది..


పోరు ముగిసింది.తెలుగువాడి ఆత్మగౌరవ పోరులో వోటరు ఎమోషనల్ అయ్యాడు. ఊహించిన ఫలితాలనే ఇచ్చాడు.తెలంగాణలో దొరబాబు, ఆంధ్రలో చంద్రబాబు సి.ఎం ఔతారు. సరె..ఎలాగూ దొరబాబు తెలంగాణని మరో సింగపూర్ చెసేస్తాడు లెండి.పాపం చంద్రబాబే సింగపూర్ చేస్తాడొ లేదొ చూడాలి..ఈసారికి ఎలాగో ఎమోషనల్ గేంస్ లో నాయకులొచ్చేశారు..ఇప్పుడు చెప్పిన వాగ్ధానాలు కాని చెయ్యకపోతే ఈసారి తాటతీస్తారు అని తెలుసుకోండి..సారి మర్చిపోయా మన "దివంగత నేత కుమారుడు" అనూహ్యంగా ఎక్కువ సీట్లు (అనుకున్నదానికన్న) గెలిచాడు. ఆత్మగౌరవం దెబ్బతింటే..దెబ్బ తప్పదు..ఇది గుర్తుంచుకోండి నాయకులారా..ఇది ఎవరికోచెప్పనక్కరలేదు..మీరు ఏమి చేసినా జనాలకి చెప్పి ఒప్పించి చెయ్యండి..

Sunday, March 9, 2014

ఎలిమినేషన్ మెథడ్..voting


రాష్ట్రంలో ఒక పెద్ద అయోమయస్థితి ఉంది ఎవడిని ఎన్నుకోవాలో అని(ఒహ్ సారీ..అంటే అంధ్ర ప్రదేశ్ లో.. తెలంగాణలొ క్లారిటి ఉంది)..నిజమే అన్ని పార్టీలు కలిసి వోటర్లని బాగా కంఫూషన్ స్టేట్ లోకి నెట్టేశాయి..సరే ఈ పరిస్తితులలో ఏమి చెయ్యాలి.. మొట్టమొదట ..విభజన గురించి మర్చిపొండి..ఎవడు మనల్ని బాగ వేపుకుతిన్నాడు 10 సం|| అని ఆలోచించండి..కూరలు, బియ్యం, పచారి, కనక, వస్తు,వాహన, విద్యుత్, రవాణా,పెట్రోలు, వంట గ్యాస్ ధరలు లెక్కకు మించి పెరగడం, వ్యవసాయదారులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు..మేము సెలవు తీసుకుంటాం (క్రోప్ హాలిడె) మహాప్రభో అన్నాకుడా వినిపించుకోకపోవటం.. వోక్స్ వాగన్ కుంభకొణం, ఫ్యాబ్ సిటి ఏమయ్యింది..సాఫ్ట్వేర్ ఉద్యొగాల కుదేలు..2జి, 3జి..10జి స్కాంలు..ఆర్ధిక వ్యవస్త కుదేలు..అదుపులోకి రాని ద్రవ్యోల్బణం,దానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, విద్యుత్ లేక చిన్న పరిశ్రమల మూత, ఇది అయిన 8 నెలలకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లా కొత్త పరిస్రమలకు పిలుపు(ఫ్లాప్ అయ్యింది లెండి..)..సరయిన రాయితీలు లేక పరిస్రమల రంగం కుదేలు..ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగు కాలేజీల పెంపు (ఒకేసారి 50కె సీట్ల నుండి 1,30,000),ఉద్యోగాలు లేక యువత కష్టాలు, సెజ్ లు వలన భూ భాగోతం, ఖజానాలో దబ్బులేదురా అన్న వినిపించుకోకుండ..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అన్నీ ఫ్రీ.ఎలా ఆదుకుంటారు ఏమి పీకగలరు..చిట్ట చివరిగా ఒక పద్దతి పాడు లేకుండా విభజన..చిన్న పెద్ద, ముసలి ముతక తేడా లేకుండ రోడ్డు ఎక్కితే కనీసం జవాబుదారితనం లేదు..విభజన జరిగినా ఎవరికి అన్యాయం జరగదు అని ఒక హామి అధికారికంగా లేదు..ఇరుప్రాంత ప్రజలకి భరోసా ఇచ్చే ప్రకటనలు లేవు...ప్రజలకి అవగాహన కలిపించే నాధుడు లేడు..ఇది మన భారతం..ఎవడిని నమ్మాలి..ఎన్నికలొచ్చాయి మళ్ళీ అదె బాట..ఫ్రీ..ఫ్రీ..రండి బాబు రండి.. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రీ కాదు..ఇప్పటికైన కళ్ళుతెరవండి.. ఇంత చేసిన కాంగ్రెస్సు ఇంక భూస్తాపితం చెయ్యండి..ఆటలో అరటిపండులా మళ్ళీ వీల్ల చేతుల్లొ పెట్టకండి..వీళ్ళకి అధిస్టానం మాటే వేదం..సొంత అభిప్రాయాలుండవు..అందుకే సరయిన మెజారిటి వేరే వాళ్ళకి ఇవ్వండి... ఎలిమినేషన్ మెథడ్: నో కాంగ్రెస్స్, దాని పిల్ల పార్టిలు వై.ఎస్.అర్, కిరణ్ కొత్త పార్టి లకి నో, పవన్ కల్యాన్ పార్టి (ఒక వేళ పెడితే) పెద్ద జోక్..ఇక మిగిలింది టి.డి.పి. మరియు లోక్సత్త..లోక్సత్త వస్తే మంచిదే..కాని ఇస్తే ఫుల్ మెజారిటి ఇవ్వండి లేకపోతే టి.డి.పి కి ఇవ్వండి..అంతే కాని అటు ఇటు కాని పార్టీలని ప్రోత్సహించవద్దు..చంద్రబాబు మంచి స్టేట్స్మాన్..అని నా అభిప్రాయం..లేదు నేను ఎవడి మాట వినను అంటే.."వోట్ ఫర్ నన్" అయినా వేసి చావండి...అంతే కాని పనికిమాలిన వెదవలకి అనవసరంగా వెయ్యొద్దు..

Tuesday, February 25, 2014

వి"భజన.."

రాజ్యసభ చర్చ మొత్తం చూశాను. ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అని నిరూపించారు. ఇక్కద ఒక విషయం గమనించండి. నేను తెలంగాణ వ్యతిరేకంగ చెప్పటం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో పుట్టిన పౌరిడిగ చెప్తున్నా.. తెలంగాణా బిల్లు పాసయ్యింది..మంచిది. ఒక సొల్యూషన్ వచ్చింది..కాని సభ్యులు (ముఖ్యంగా వెంకయ్య) అడుగుతున్న ఒక్క ప్రశ్నకైనా సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. కొన్ని ప్రాజెక్టులు పేపర్ లో ఇరిగేషన్ అని రాసి..నొటి మాటతో బహుళార్ధ సాధకాలు అని చెప్పారు..కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే మొదలయ్యాయి కదా వాటి పరిస్తితి ఎంటి (రెందు రాస్త్రాల ఉమ్మడి ప్రాజెక్ట్) అని అదిగితే అవి కొనసాగుతాయి అంటున్నారు ? అది ఎవరు పూర్తి చెయ్యాలి, తరువాత ఎవరివాటా ఎంత? అని అదిగితే దానికి సమధానం లేదు..కొన్ని సవరణలు అయితే మరీ దారుణం..మెము చేస్తాం..చూస్తాం అని..కొన్నింటికి అర్థం వాళ్ళకే గాని ఎవరికీ అర్థం కాని రీతిలో ఉన్నాయి..5 సం|| ప్రత్యేకం మనవాళ్ళు తినడనికే సరిపోదు ఇంకేమి బాగుచేస్తారు? ఇప్పుడు బద్జెత్ లో కేటయించరు అంట ..ఇంకో 3-4 నెలలలో కెటాయించవచ్చు...విభజించిన ప్రభుత్వమే ఇల చెప్తే తరువాత వచ్చిన ప్రభుత్వం ఇంకేమి చేస్తుంది? "మూజువాణి వోటింగు" అంటే అర్థం తెలిసింది. హౌసు ఆర్డర్ లో లేకపోతే..అరుపుల ద్వారా నిర్ణయించేది. కొన్ని సవరణలకి దీన్ని స్పీకర్ నిర్వహించిన తీరు..కేక..ముందే స్క్రిప్టు వచ్చేసినట్లు ఎక్కువ "నో"స్ వినిపిస్తున్నా..వీగిపోయినట్లు ప్రకటించడం..ఇంక వెంకయ్య చేసేది లేక నోరుమూసుకొవటం..అప్పటికీ కొన్ని పార్టీలు హౌసు ఆర్డరులోనే ఉందికద "వోటింగు" చెయ్యొచ్చు కదా అని అదిగితే స్పీకర్ పట్టించుకోలేదు (నిజంగ అప్పటికి ఆర్డెర్లోనే ఉంది) అద్భుతం ఏంటంటే ఇంత జరుగుతున్నా మీడియాలో ఎప్పుదూ ఇచ్చిన ఆ రెందు ముక్కలే ఇవ్వటం (అదీ ఒకపక్కన లైవ్ ఇస్తూ) చాలా మంది సభ్యులు ఈ చ్చెండాలం చూడలేక వెల్లిపోతే..చివరకు మిగిలింది కాంగ్రెస్సు వాళ్ళు..అప్పుదు మన స్పీకర్ గారు ఫైనల్ బిల్లు మూవ్ చేస్తున్నాం అని చెప్పటం.."యెస్" అని చెప్పడం.. అదే రెపీటెడ్ గా మన సో కాల్డ్ టి.వీ లు పదే పదే చుపించడం..ఎవరైన చూస్తే ఆహ ఎక్కువ మెజారిటియే వచ్చింది కదా అని అన్నట్టుంది..ఫ్రెండ్స్ నేను రాష్త్రం విడిపోయిందని బాధపడటంలేదు..కాని ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని బాధపదుతున్నా..మళ్ళీ కొందరు ఈ బాధ మాకు (టీ కి) అన్యాయం జరిగినప్పుడు లేదా అని అనకండి..ఇది ప్రజాస్వామ్యంలోనే అతిముఖ్యమైన పార్లమెంటులో జరిగింది..విభజించేటప్పుడు వచ్చే సమస్యలని అడ్రెస్ చేసి పక్కా ప్రణలిఖతో విడిపోతే ఎంత బాగుండు అనేది నా పాయింటు..అంతే..సరే అయిపోయింది కదా.. "తాంబూలాలు ఇచ్చేశాం ఇంక తన్నుకు చావండి!" ఇంక చూస్కోండి..

Saturday, March 19, 2011

చైతన్యం..

5 సం|| క్రితం నాకు నేను రాసుకున్న వ్యాసం..ఇక్కడ ప్రచురిస్తున్నాను..

చైతన్యం..నా చిన్నప్పటినుండి ప్రతీ సినిమాలోనూ, టీ.వీ లలోనూ వింటున్న పదం.దానికర్థం నాకప్పుడు తెలీదు. ఇప్పుడు కూడ తెలీటంలేదు. తెలియటానికి ఎప్పుడైనా దానిగురించి ఆలోచిస్తే కదా!అయినా, ఆలోచించినంత మాత్రాన తెలిసిపోతుందా ఏమిటి? చిన్నతనంలో ప్రజల్లో "చైతన్యం" రావాలి అన్న పదం తప్ప ఎవరూ నాకు చైతన్యానికి అర్థం చెప్పలేదు.
ఎన్నిసార్లు ఎన్నుకున్నా, చెప్పిన వాగ్ధానాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో చెప్పి, అవి నెరవేర్చకుండా మళ్ళీ మొహం తుడుచుకొని 5 యేళ్ళ తరువాత కనిపించినా రూపాయి కాసులకి, సారా పాకెట్లకి జనం అమ్ముడుపోయి ఓట్లు వేసినప్పుడు మొదటిసారి "చైతన్యం" అంటే ఏమిటో తెలిసింది. అయినా నేను అనుకున్న చైతన్యం నాకు వచ్చి, నేను ఒక్కడిని ఆ మనిషికి ఓటు వెయ్యకపోయినా, మిగతా జనం ఓట్లు వేసి గెలిపించినప్పుడు ..వాళ్ళకి చైతన్యం లేదు అనుకున్నాను. ఈ చైతన్యం గురించి నాలాగ బాధపడేవాళ్ళు అన్నిరంగాలలోనూ ఉన్నారు. సినిమా రంగంలోని ఒక డైరెక్టరు..చైతన్యం ఎక్కువై ఒక సినిమా తీస్తే.. వందరోజులు ఆడింది. నూటఒకటో రోజునుండి మర్చిపోయారు. ఏ చైతన్యం గురించి ఆ దర్శకుడు ప్రయత్నించాడో..దానికి.. నూటఒకటో రోజు తెరపడింది. చాలా రోజుల తరువాత మరొక దర్శకుడు ప్రయత్నిస్తే పట్టుమని పది రోజులు కూదా ఆడలేదు. మరి చైతన్యం ఎలా వస్తుంది ఈ ప్రజల్లో?

ఇదివరకు "రాజకీయ" నాయకులు, 'అమ్మో ప్రజలకి తెలిస్తే ఓట్లేయరేమో' అని భయపడేవారు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయినట్లుంది..ప్రజలకి చైతన్యం లేదని. దాంతో వాళ్ళు రెచ్చిపోయి, ఒక్కొక్కరికి ఒక రాజ్యం (కొంత భూభాగం) ఇచ్చేస్తే,. దానికి వాళ్ళు రాజులై పరిపాలించుకొని, దానిని దోచుకుందామని అనుకుంటున్నారు.బహిరంగంగా "నీకెంత" అంటే "నీకెంత?" అనుకొనేవరకు వచ్చింది. అయినా ప్రజల్లో చైతన్యం రాలేదు.

ఇప్పుడు పరిస్థితులు మారాయి, ప్రతీ ఇంటిలోనూ ఒక టీ.వీ, ఒక్క మన రాష్ట్రం లోనే 4 ప్రముఖ వార్తా ఛానెళ్ళు, 5 ప్రముఖ వినోద ఛానెళ్ళున్నాయి, మీడియా బలపడింది అని మీరు అనుకోవచ్చు.. కాని వీళ్ళలో కూడా చైతన్యం కరువయ్యింది. ఎన్ని చానెళ్ళు ప్రజాభిప్రాయాల్ని, నిపుణుల/విద్యావంతుల సలహాలను, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? కొన్ని చానెళ్ళు కొంచెం ధైర్యం చేసి రహస్య కెమేరాలతో కొంతమంది "ప్రముఖుల" జాబుతాలను బయటికి తెచ్చినా.. కొద్దిరోజుల్లోనే వాళ్ళు తల ఎత్తుకొని తిరిగే రోజులొచ్చాయి.అయినా ప్రేక్షకులు లేని కార్యక్రమాలను టీ.వీలు మాత్రం ఎలా ప్రసారం చేస్తాయి చెప్పండి.. ఇలాంటి మంచి కార్యక్రమాలు, చర్చలు రాగానే, కుర్రకారు ఛానెల్ మార్చేస్తోంది. అవును.. ఎందుకు ఈ చర్చలు..ఎవరి దృష్టి ఆకర్షిద్దామని? కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రజల్లో "చైతన్యం" రాలేదు. చైతన్యం లేని యువత రాజకీయల్ని వారసత్వానికి పరిమితం చేస్తుంది. చైతన్యం ఉన్నా..విద్యావంతుల మేధస్సు కేవలం టీ.వీ.ల్లో చర్చలకే పరిమితం ఔతుంది. "నేను ఒక్కడినే సమాజాన్ని మార్చలేను" అనే అశక్తత పెరిగి చైతన్యాన్ని అడ్డుకుంటుంది.

చైతన్యం అంటే నాకు తెలిసింది. చైతన్యం అంటే బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చినప్పుడు చైతన్యం వచ్చినట్లే. "సమాజాన్ని మార్చడానికి ఉద్యమించిన వారిలో నేనూ ఒకడిని" అని అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. "నాకెందుకులే" అనుకున్న దానినుండి "నేను సైతం" అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. ఈ చైతన్యం "ఒక" పౌరుణ్ణి నిద్ర లేపాలి. హక్కుల్ని అడిగేముందు విధుల్ని నిర్వర్తించేలా చేయాలి.ఈ చైతన్యం, యువతను ఆలోచింపచేయాలి.ఈ చైతన్యం, ఒక సారాయి పేకెట్టుకి దేశభవిష్యత్తును అమ్మకుండా ఆపగలగాలి. ఎవరికి అన్యాయం జరిగినా బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసి, మన సొమ్ము మనమే నాశనం చేసుకుంటున్నామని తెలుసుకునేలా చేయాలి. రాయితీలను కులాలను బట్టి కాక పేదవారికి చేర్చగలగాలి.

WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
--Rabindranath Tagore

దీనికి అర్థం చెప్పక్కరలేదు..రవీంద్రుడు అర్థమయ్యేటట్లే చెప్పాడు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో..

To be continued...