Saturday, September 20, 2008

మీ వంతు కౄషి

ఆంధ్ర రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో కొత్త పార్టీలు ఆవిర్భవించాయి.కొన్ని పాత పార్టీలు బలహీనమయ్యాయి. కొన్ని బలపడటానికి కస్టపడుతున్నాయి. అధికార పార్టి నిలదొక్కుకొవటానికి కొన్ని అర్థవంతమయిన, మరికొన్ని అర్థంలేని, అర్థం కాని పధకాలని ప్రవేసపెడుతోంది. వీటిల్లొ దేనిని అర్థం చేసుకోవాలో, దేనిని చేసుకోవఖ్ఖర లేదో అర్థం కాక సామాన్య మానవుడు తికమక పడుతున్నాడు. నిత్యవసర వస్థు ధరలు పెరుగుదల, స్టాక్ మార్కెట్ పతనం, మద్య తరగతి ప్రజలని కోలుకొకుంద చేస్తున్నయి అంటే అది అతిశయోక్తి కాదు. అమెరికా ఆర్థిక మాంద్యం పరోక్ష ప్రభావం వలన యువకులకు ఉద్యోగ అభద్రత భావం. సకాల వర్షాలను ఆసించిన రైతన్నకు అతివౄస్టి తొ కొన్ని చొట్ల దేవుడు, వర్షాలు పడినా ఎరువుల కొరత వలన కొన్ని చొట్ల సర్కారు నిరాశే మిగుల్చుతున్నారు. ఈ విధంగా ఉన్న మన రాష్ట్ర ప్రజలని ఒక్కో పార్టి ఒక్కో 'తాయిలం' ఇచ్చి వశపరుచుకుందామని ప్రయత్నిస్తున్నాయి.కాబట్టి ఒక చీర, జాకెట్టు కి, కుంకుమ భరినకి, వంద రూపాయల సొమ్ముకి, ఒక సార పేకెట్టు కి దేశ భవిస్యత్తు అమ్మవద్దని మనవి.చదువుకున్న వరూ, ప్లీజ్ దయచేసి మీ ఓటు హక్కు వినియోగించు కోండి. ఓ నా తోటి ఓటరుమహాశయులారా! తాత్కాలిక ప్రయోజనాలని ప్రకటించే వారిని కాకుండా ఒక మంచి నిర్ణయం తొ ఈ రాస్ట్ర తద్వారా దేశ భవిశ్యత్తు ను నిర్ణయించాలని ప్రార్థిస్తూ.
మీ సునీల్