Monday, December 28, 2009

రాజ్యాంగం అంటె రాజకీయం కాదు.

ఎన్నికలు అయిపొయాయి.ప్రజలు తమ ఇష్టం వచ్చిన వాల్లకి వోట్లు వేసి గెలిపించారు.మళ్ళీ ఏ పార్టీ కీ మంచి మెజారిటీ రాలేదు. అంకెల గారడి తో, ఆటలో అరటిపండు లా కాంగ్రెస్ మళ్ళీ గద్దెనెక్కింది. సరె, రాజశేఖరుడు ఉన్నాడు లే అని అనుకునే వాళ్ళకి ఆయన పెద్ద షాకే ఇచ్చాడు (చనిపోయి). కొంతమంది "రాజకీయ" నాయకులకి ఇది శుభవార్తే అయ్యింది. ఆయన సానుభూతి వోట్లతొ "కుమారుడిని" గద్దెనెక్కింద్దామనుకున్నవాళ్ళ పాచిక పారలేదు.తరువాత ఎవరికి పగ్గాలు అప్పజెప్పలా అని అనుకున్న అధిస్టానానికి మిగిలిన ఒకే ఒక ఛాయిస్ రొశయ్య. పాపం ఈయన గ్రహ చారమో లేక రాష్ట్ర గ్రహచారమో కాని, మూడు కరువులు ఆరు వరదలు, ఒక తెలంగాణ సమస్యతొ ప్రజలు పండగ చేసుకుంటున్నారు.

ఇక్కడివరకు ఒక యెత్తు అయితే ఇక్కడినుండి అసలు కథ మొదలయ్యింది. కొన్ని నాటకీయ పరిస్తితుల్లో కేంద్రం చేసిన ప్రకటన (స్పస్టం గానే ఉన్నప్పటికీ) కొంతమంది ప్రజలకి/నాయకులకి అర్థం కాలేదు (ఇంగ్లిష్ లో చెప్పారు కదా). అర్థం అయిన నాయకులు..కేంద్రం చెప్పిన దానికన్నా, ప్రజలు చెప్పిన కొత్త అర్థమే బాగుంది అనుకున్నరో ఎమో కాని, "ఫ్రోసెస్ ఆఫ్ తెలంగాణ" ని "తెలంగాణ అవతరణ" గా మార్చేశారు. అసలైన అర్థం చెప్పాల్సిన మీడియా.. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని హైలైట్ చేస్తూ ప్రజలని తప్పు దారి పట్టిస్తుంది. ఇప్పుడు సుమారు 10 నిరంతర వక్రభాష్యాస్రవంతులున్నాయి మన రాష్ట్రం లో. వీళ్ళపని.. ఎవరు వక్ర భాష్యాలు చెప్తారో వారిని హైలైట్ చెయ్యటం. ఈ నేపధ్యం లొ అంధ్ర ప్రజల "సమైఖ్యాంధ్ర ఉద్యమం" ఊపందుకుంది. కేంద్రానికి "వదలమంటే పాముకి కోపం.. వదలొద్దంటే కప్పకి కోపం" చందాన ఏమి చెప్పాలో అర్థం కాలేదు. కేంద్రం ఏమి మాట్లడకపోవడంతొ ఎవరిస్టానుసరం వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మన నాయకులు, నయ(వంచ)కులు.

నిన్న ఒక నాయకుదు.."చిరంజీవి ని లగడపాటిని ఉస్మానియా కి వచ్చి సమైఖ్యాంధ్ర అనమనండి, తెలంగాణ ప్రజలు తోలు తీస్తరు" అన్నారు. అంటే (తెలంగాణ) ప్రజలకి పరోక్షం గా "మనకు వ్యతిరేకం గా ఎవరు మాట్లాడినా తోలు తీయమని చెప్తున్నారా?". సగటు మనిషి అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చునని, దానిని ప్రజస్వామ్యం లొ 'వాక్ స్వాతంత్రయం' అంటారని ఈయనకి తెలీదా? తెలిసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెయ్యకూడదని కూడా తెలీదా. సందట్లొ సడెమియా అని యెన్.డి.తివారి ఏదొ వేరె స్కాం లో దొరికిపొతె..దానిని ఖండించకుండా.. రాజీనామా చేసేసి, ఇప్పుడు దానిని తెలంగాణ ఇష్యూ తొ కలుపుతున్నాడు. 85 యేళ్ళు వచ్చినా రాజకీయాలు మానలేదు ఈయన.

ఓ నా ప్రజలార...తెలంగాణ కావాలంటే ప్రజాస్వామ్య బధ్ధం గ పోరాడండి, సాధించుకోండి. తొటి పౌరుడి హక్కులను కాపాడండి, మీ బాధ్యత తెలుసుకోండి. కాని ఈ ముదనస్టపు రాజకీయ నాయకుల మాటలకు బలి కావద్దు.

నాయకులారా: రాజ్యాంగం అని ఒక పుస్తకం ఉంటుంది. ఇందులొ రాజకీయం గురించి ఉండదు...రాజ్య పరిపాలనా నిబంధనలు ఉంటాయి..కొని చదవండి. అర్థం కాకపొతే అడగండి. వచ్చీ రాని విద్యతో ప్రజల జీవితాలతో ఆడుకొవద్దు.
రాజ్యాంగం అంటె రాజకీయం కాదు.