Wednesday, May 12, 2010

భూగర్భ 'జల' ఘోష

ఈ పోస్ట్ రాజకీయాలకి సంబంధించినది కాకపోయినా చాలా ముఖ్యమైన పోస్ట్ అని భావించి ఇక్కడ రాస్తున్నాను.
విషయం ఏంటంటే, ఆ మధ్య భూగర్భ జలాలు గురించి ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది.ఎన్నో విషయాలని పట్టించుకోని జనం దీనిని కూడా పట్టిచుకొలేదు. కాని అందులోని విషయాలు నన్ను చాలా కలవర పరిచాయి.

పూర్వం లాగ వర్షం నీరు భూమిలోనికి ఇంకే అవకాశం లేకుండ సిమెంట్ రోడ్లతో కప్పేసుకుంటున్నాం, చెరువులను పూడ్చుకుంటున్నాం, ఇలా ఆలోచిస్తే ఎన్నో. ఇంటి ముందు ఒక "ఇంకుడు గుంత" ని పెట్టమంటే.. ఆ.. ఎవడూ పెట్టనిది నేనెందుకు పెట్టాలి లే అనుకుంటున్నాం. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకొలేకపోతున్నాం. అనేక కారణాల వలన ఇప్పటికే వాతవరణం లొ పెనుమార్పులు సంభవించాయి, ఇది ఇలాగే సాగితే అతి కొద్ది కాలం లొ మనకి పెను ముప్పు పొంచి ఉంది.
కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని మన భూగర్భ జలాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ ఇంటిముందు ఒక "ఇంకుడు గుంత" ని కట్టాలి, లేదా ఇంటి పన్ను రెండింతలు కట్టమని, కొత్త ఇళ్ళ ఆమోదనికి ప్లాను లో "ఇంకుడు గుంత" ని విధి గ పెట్టాలి, లేదా ప్లాను ఆమోదం పొందదని జీవో తేవాలి.

ఏప్పుడూ కుర్చీల (పదవుల) గురించె కాక, ఇలాంటి ముఖ్యమయిన విషయాల గురించి కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను.