Wednesday, October 13, 2010

మా తెలుగు తల్లికి..

మీకు తెలుసో తెలియదో.. ఇది మన రాష్ట్ర గీతం.. మన తెలుగు వారికి సొంతమైన, మన గొప్పతనాన్ని తర తరాలకు పంచాల్సిన.. మన "రాష్ట్ర గీతం"..

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి..

అని.. బాస చేసిన మనం ఈరొజు అదే తెలుగుతల్లి గుండెని రెండు ముక్కలు చెయ్యడమే కాకుండా..ఆ తల్లి మా తల్లి కాదు మీ తల్లి అని ఒక వర్గం చేత అనిపించుకొని తీవ్ర ఆవేదన కు గురిచేస్తున్నాం.
"వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒకటేనన్న..."
మాండలికాలెన్నున్నా, యాసలెన్నున్నా తెలుగు భాషకి లిపి ఒకటే. తెలుగుతల్లి ఏ ఒక్కరి సొంతమో కాదు..తెలుగు భాష తెలిసిన వారందరి సొంతం.
భాషా, పుట్టిన గడ్డ మీద అభిమానం, దేశభక్తి, లేని.. అదేంటో తెలియని స్వార్ధ రాజకీయ నాయకులు ఇప్పటికైన కళ్ళుతెరిచి ప్రవర్తించండి.