Thursday, January 6, 2011

తెలుగోడు

ఓ తెలుగోడా, పంటలు పండక ఏడ్చావు, పండినది అందక ఏడ్చావు.. కాయగూరలు కొనలేక ఎడ్చావు, ఇంటి అద్దె కట్టలేక ఏడ్చవు, ఉల్లి ధర పెరిగిందని ఏడ్చావు, ధాన్యం అమ్మలేక ఏడ్చావు, బియ్యం కొనలేక ఏడ్చావు, ఈ రాజకీయ నాయకుల ఆటలో పావుగా మారావు. కన్ను తెరచి భవిష్యత్తు చూడు. రాష్ట్రం ముక్కలైతే మిగిలేది పన్నులే. రాజకీయ నాయకులకి కొత్త పదవులే.అయినా ఈ ప్రజాస్వామ్య దేశం లొ నిన్నెవరు అడుగుతారు లే..దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొంటారు..
ఓ విద్యార్థీ, ఏది నీ ఛదువు? దొంగలకు గొడుగు పడుతున్నావా? తెలిసే పడుతున్నావా? ఈ ఉచ్చులొ నీ జాతి మొత్తాన్ని ఉరి తీస్తున్నవా? కళ్ళు తెరచి చూడు.. అభివ్రుద్ధి కాంక్షించు..