Wednesday, October 13, 2010

మా తెలుగు తల్లికి..

మీకు తెలుసో తెలియదో.. ఇది మన రాష్ట్ర గీతం.. మన తెలుగు వారికి సొంతమైన, మన గొప్పతనాన్ని తర తరాలకు పంచాల్సిన.. మన "రాష్ట్ర గీతం"..

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి..

అని.. బాస చేసిన మనం ఈరొజు అదే తెలుగుతల్లి గుండెని రెండు ముక్కలు చెయ్యడమే కాకుండా..ఆ తల్లి మా తల్లి కాదు మీ తల్లి అని ఒక వర్గం చేత అనిపించుకొని తీవ్ర ఆవేదన కు గురిచేస్తున్నాం.
"వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒకటేనన్న..."
మాండలికాలెన్నున్నా, యాసలెన్నున్నా తెలుగు భాషకి లిపి ఒకటే. తెలుగుతల్లి ఏ ఒక్కరి సొంతమో కాదు..తెలుగు భాష తెలిసిన వారందరి సొంతం.
భాషా, పుట్టిన గడ్డ మీద అభిమానం, దేశభక్తి, లేని.. అదేంటో తెలియని స్వార్ధ రాజకీయ నాయకులు ఇప్పటికైన కళ్ళుతెరిచి ప్రవర్తించండి.

Wednesday, May 12, 2010

భూగర్భ 'జల' ఘోష

ఈ పోస్ట్ రాజకీయాలకి సంబంధించినది కాకపోయినా చాలా ముఖ్యమైన పోస్ట్ అని భావించి ఇక్కడ రాస్తున్నాను.
విషయం ఏంటంటే, ఆ మధ్య భూగర్భ జలాలు గురించి ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది.ఎన్నో విషయాలని పట్టించుకోని జనం దీనిని కూడా పట్టిచుకొలేదు. కాని అందులోని విషయాలు నన్ను చాలా కలవర పరిచాయి.

పూర్వం లాగ వర్షం నీరు భూమిలోనికి ఇంకే అవకాశం లేకుండ సిమెంట్ రోడ్లతో కప్పేసుకుంటున్నాం, చెరువులను పూడ్చుకుంటున్నాం, ఇలా ఆలోచిస్తే ఎన్నో. ఇంటి ముందు ఒక "ఇంకుడు గుంత" ని పెట్టమంటే.. ఆ.. ఎవడూ పెట్టనిది నేనెందుకు పెట్టాలి లే అనుకుంటున్నాం. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకొలేకపోతున్నాం. అనేక కారణాల వలన ఇప్పటికే వాతవరణం లొ పెనుమార్పులు సంభవించాయి, ఇది ఇలాగే సాగితే అతి కొద్ది కాలం లొ మనకి పెను ముప్పు పొంచి ఉంది.
కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని మన భూగర్భ జలాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ ఇంటిముందు ఒక "ఇంకుడు గుంత" ని కట్టాలి, లేదా ఇంటి పన్ను రెండింతలు కట్టమని, కొత్త ఇళ్ళ ఆమోదనికి ప్లాను లో "ఇంకుడు గుంత" ని విధి గ పెట్టాలి, లేదా ప్లాను ఆమోదం పొందదని జీవో తేవాలి.

ఏప్పుడూ కుర్చీల (పదవుల) గురించె కాక, ఇలాంటి ముఖ్యమయిన విషయాల గురించి కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను.

Tuesday, February 9, 2010

ఇలా ఆలొచిస్తే వింతగా ఉంది కదూ!

ప్రస్తుత రాజకీయలను చూస్తే నాకొక ఆలోచన వస్తుంది. అసలు "రాజకీయ పార్టీ" అనే ఒక కాన్సెప్టే లేదంటే, అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థులైతే అప్పుడు రాజకీయాలు బాగుపడతాయేమో?
ఒక మనిషి తప్పు చేస్తే, పార్టీ పేరుతో ఎవరూ వెనకేసుకురానక్కరలేదు.
ఒక నిర్ణయం తీసుకోవలంటే, పార్టీ అధిస్టానం లాంటి వారి నిర్ణయం కోసం ఆగనక్కరలేదు. సింపుల్ వోటింగ్ సరిపోతుంది.
వోటు వేసే వోటరు పార్టీ కి గుడ్డి గ వెయ్యడు. మనిషికి వేస్తాడు.
అధికార పార్టి అనేదే లేకపొతే, అధికార పార్టి నాయకులు (వీళ్ళకి పదవులుండవు, కాని అధికార పార్టి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. వీళ్ళని అంటిపెట్టుకొని మరికొన్ని పరాన్న జీవులు..ఇలా) ఉండరు.

ఎవడికి సమర్ధత ఉంటే వాడు నిధులు సంపాదిస్తాడు..వాడి ఏరియా డెవెలప్ చేసుకుంటాడు. చెయ్యకపోతే ప్రజలు వాడికి మళ్ళీ వోట్లు వెయ్యరు.

ఇలా ఆలొచిస్తే వింతగా ఉంది కదూ!

వినియోగదరుడే సమ్మె చేస్తే

ఎప్పుడూ ధరలు పెంచమని మద్యవర్తి వ్యాపరులు బంధ్ చేస్తారు...దానికి ఎప్పుడూ బలయ్యేది సామాన్య ప్రజలే కదా..పెట్రోల్ పెరిగినా, లారీ సమ్మె అయిన...వంట గ్యాస్ పెంచినా...అన్నీ..పరోక్షంగా..సామాన్య వ్యక్తి నడ్డి విరిచెవే కదా? అలాంటిది ఒకసారి వినియోగదారుడే సమ్మె చెస్తే?

ఈ మధ్యనే మాంసం వ్యాపారుల సమ్మె కి ప్రభుత్వం దిగి వచ్చి ధరలు పెంచేసింది.. ఇప్పుడు వినియోగదారులమైన మనం మాంసం తినటం ఒక నెల మానేస్తే?
గునపాఠం నెర్పినత్లు ఔతుంది కదా?

మీరేమంటారు?