Thursday, March 10, 2011

దీనికి ఏ శీర్షిక పెట్టాలో తెలీక!!

మీ పిండాకూడు పిల్లులు తిన..మీకు శ్రార్ధం పెట్ట..ఇంకా ఆన్ని బూతులు కలిపి... మీ రాజకీయలను తగలబెట్ట..అన్నమయ్య, పింగళి, వీరేశలింగం ఆ మహానాయకుల విగ్రహాల జోలికి వెళ్ళారేంట్రా...వెళ్ళటానికి మేకు అర్హత ఎక్కడ ఉంది? ఎర్రాప్రగడ, శ్రీ శ్రీ, జాషువా లు మీకు ఏమి అన్యాయం చేశారు రా?

వీరు, మీకు కావాల్సిన పదవులు ఇవ్వలేదా? తెలంగాణ ఇవ్వనన్నారా వీళ్ళు? అభాగ్యుల మీద అత్యాచారం చేసిన "దొరలా", "రజాకార్లా", భారతీయుల ఆత్మ గౌరవాన్ని సవాల్ చేసిన "తెల్లవాళ్ళా?". వీళ్ళకి.. "నేటి తెలంగాణ సమస్య"కి సంబంధం ఏంటిరా?

జాతి కోసం పుట్టి, పోరాడిన వారు కొందరైతే, భాష సంస్కారం కోసం, మానసిక చైతన్యం కోసం కొందరు, బడుగు బలహీన వర్గాల గొంతైంది మరికొందరు. జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి పుట్టిన మహా మనుషులను గుర్తుంచుకొని వారి అడుగు జాడలలో నడవాల్సింది పోయి.. ఈరోజు జరిగిన విగ్రహ ధ్వంసా కార్యక్రమం నీచమైనదనాలా..దారుణమైనదనాలా..లేక చివరికి.. అందరిలాగానే ప్రభుత్వ వైఫల్యమనాలా? ఛా! అసహ్యం వేస్తుందిరా! మిమ్మల్ని ఏమీ చెయ్యలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది.ప్రస్తుతానికి నాకు కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది. కొన్నాళ్ళకి అడిగిన వాడికి ఓటు వెయ్యకపోతే కొడతారేమో..ఇదీ ప్రజాస్వామ్యం.

అసలే విగ్రహాలు పగలకొట్టారు అని బాధపడుతుంటే, ఒక వార్తా ఛానెల్ "ఇది సమంజసమా అని ఓటింగ్ పెట్టింది". విచిత్రంగా, మంచోళ్ళు కన్నా పిచ్చొళ్ళే ఎక్కువగ ఉన్నారు అని వోతింగ్ లో తేలింది. ప్రజలారా, మన జాతి నాశనం సమంజసమా?

No comments: