Saturday, March 19, 2011

చైతన్యం..

5 సం|| క్రితం నాకు నేను రాసుకున్న వ్యాసం..ఇక్కడ ప్రచురిస్తున్నాను..

చైతన్యం..నా చిన్నప్పటినుండి ప్రతీ సినిమాలోనూ, టీ.వీ లలోనూ వింటున్న పదం.దానికర్థం నాకప్పుడు తెలీదు. ఇప్పుడు కూడ తెలీటంలేదు. తెలియటానికి ఎప్పుడైనా దానిగురించి ఆలోచిస్తే కదా!అయినా, ఆలోచించినంత మాత్రాన తెలిసిపోతుందా ఏమిటి? చిన్నతనంలో ప్రజల్లో "చైతన్యం" రావాలి అన్న పదం తప్ప ఎవరూ నాకు చైతన్యానికి అర్థం చెప్పలేదు.
ఎన్నిసార్లు ఎన్నుకున్నా, చెప్పిన వాగ్ధానాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో చెప్పి, అవి నెరవేర్చకుండా మళ్ళీ మొహం తుడుచుకొని 5 యేళ్ళ తరువాత కనిపించినా రూపాయి కాసులకి, సారా పాకెట్లకి జనం అమ్ముడుపోయి ఓట్లు వేసినప్పుడు మొదటిసారి "చైతన్యం" అంటే ఏమిటో తెలిసింది. అయినా నేను అనుకున్న చైతన్యం నాకు వచ్చి, నేను ఒక్కడిని ఆ మనిషికి ఓటు వెయ్యకపోయినా, మిగతా జనం ఓట్లు వేసి గెలిపించినప్పుడు ..వాళ్ళకి చైతన్యం లేదు అనుకున్నాను. ఈ చైతన్యం గురించి నాలాగ బాధపడేవాళ్ళు అన్నిరంగాలలోనూ ఉన్నారు. సినిమా రంగంలోని ఒక డైరెక్టరు..చైతన్యం ఎక్కువై ఒక సినిమా తీస్తే.. వందరోజులు ఆడింది. నూటఒకటో రోజునుండి మర్చిపోయారు. ఏ చైతన్యం గురించి ఆ దర్శకుడు ప్రయత్నించాడో..దానికి.. నూటఒకటో రోజు తెరపడింది. చాలా రోజుల తరువాత మరొక దర్శకుడు ప్రయత్నిస్తే పట్టుమని పది రోజులు కూదా ఆడలేదు. మరి చైతన్యం ఎలా వస్తుంది ఈ ప్రజల్లో?

ఇదివరకు "రాజకీయ" నాయకులు, 'అమ్మో ప్రజలకి తెలిస్తే ఓట్లేయరేమో' అని భయపడేవారు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయినట్లుంది..ప్రజలకి చైతన్యం లేదని. దాంతో వాళ్ళు రెచ్చిపోయి, ఒక్కొక్కరికి ఒక రాజ్యం (కొంత భూభాగం) ఇచ్చేస్తే,. దానికి వాళ్ళు రాజులై పరిపాలించుకొని, దానిని దోచుకుందామని అనుకుంటున్నారు.బహిరంగంగా "నీకెంత" అంటే "నీకెంత?" అనుకొనేవరకు వచ్చింది. అయినా ప్రజల్లో చైతన్యం రాలేదు.

ఇప్పుడు పరిస్థితులు మారాయి, ప్రతీ ఇంటిలోనూ ఒక టీ.వీ, ఒక్క మన రాష్ట్రం లోనే 4 ప్రముఖ వార్తా ఛానెళ్ళు, 5 ప్రముఖ వినోద ఛానెళ్ళున్నాయి, మీడియా బలపడింది అని మీరు అనుకోవచ్చు.. కాని వీళ్ళలో కూడా చైతన్యం కరువయ్యింది. ఎన్ని చానెళ్ళు ప్రజాభిప్రాయాల్ని, నిపుణుల/విద్యావంతుల సలహాలను, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? కొన్ని చానెళ్ళు కొంచెం ధైర్యం చేసి రహస్య కెమేరాలతో కొంతమంది "ప్రముఖుల" జాబుతాలను బయటికి తెచ్చినా.. కొద్దిరోజుల్లోనే వాళ్ళు తల ఎత్తుకొని తిరిగే రోజులొచ్చాయి.అయినా ప్రేక్షకులు లేని కార్యక్రమాలను టీ.వీలు మాత్రం ఎలా ప్రసారం చేస్తాయి చెప్పండి.. ఇలాంటి మంచి కార్యక్రమాలు, చర్చలు రాగానే, కుర్రకారు ఛానెల్ మార్చేస్తోంది. అవును.. ఎందుకు ఈ చర్చలు..ఎవరి దృష్టి ఆకర్షిద్దామని? కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రజల్లో "చైతన్యం" రాలేదు. చైతన్యం లేని యువత రాజకీయల్ని వారసత్వానికి పరిమితం చేస్తుంది. చైతన్యం ఉన్నా..విద్యావంతుల మేధస్సు కేవలం టీ.వీ.ల్లో చర్చలకే పరిమితం ఔతుంది. "నేను ఒక్కడినే సమాజాన్ని మార్చలేను" అనే అశక్తత పెరిగి చైతన్యాన్ని అడ్డుకుంటుంది.

చైతన్యం అంటే నాకు తెలిసింది. చైతన్యం అంటే బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చినప్పుడు చైతన్యం వచ్చినట్లే. "సమాజాన్ని మార్చడానికి ఉద్యమించిన వారిలో నేనూ ఒకడిని" అని అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. "నాకెందుకులే" అనుకున్న దానినుండి "నేను సైతం" అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. ఈ చైతన్యం "ఒక" పౌరుణ్ణి నిద్ర లేపాలి. హక్కుల్ని అడిగేముందు విధుల్ని నిర్వర్తించేలా చేయాలి.ఈ చైతన్యం, యువతను ఆలోచింపచేయాలి.ఈ చైతన్యం, ఒక సారాయి పేకెట్టుకి దేశభవిష్యత్తును అమ్మకుండా ఆపగలగాలి. ఎవరికి అన్యాయం జరిగినా బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసి, మన సొమ్ము మనమే నాశనం చేసుకుంటున్నామని తెలుసుకునేలా చేయాలి. రాయితీలను కులాలను బట్టి కాక పేదవారికి చేర్చగలగాలి.

WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
--Rabindranath Tagore

దీనికి అర్థం చెప్పక్కరలేదు..రవీంద్రుడు అర్థమయ్యేటట్లే చెప్పాడు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో..

To be continued...

3 comments:

yvk said...

eraa neeku office lo bottiga pani pata lenattundi. Maku kooda edaina post unte choodara :)

GANESH said...

if u have passion on something,
i dont think time will b a big matter...
nijamga lekapote meru a job ki vellina em cheyaleru...
mr.suneel i dont think u will get these comments if u choose some topic of peoples interest...

Suneel Vantaram said...

@yvk, nenu oka night upto 2 varaku undi tyoe chesi publish chesanu mama..office lo kadu..